ఒక సమాజం మొత్తం గానీ, ఒక యావత్తు దేశం గానీ, లేదా భూమిపై ఉన్న మొత్తం సమాజాలన్నీ కలుపుకున్నాగానీ వారు భూమికి యజమానులు కారు. కేవలం ఆ భూమిపై గల వనరులను వినియోగించుకోవడం, దాని ప్రయోజనాలు పొందడం మాత్రమే వారు చేయాలి. తమ తరువాతి తరాలకు ఈ భూమిని మరింత మెరుగైన స్థితిలో అప్పచెప్పడం వారి బాధ్యత.

