తెలుగు రచయితలు, కళాకారులు, మేధావులు, లౌకిక, ప్రజాస్వామ్యవాదులు, హేతువాదులు, ప్రజలు అందరం తులసి చoదుకు అండగా నిలబడదాం!
ప్రగతిశీల వాదులారా!
జర్నలిస్ట్ తులసి చoదు, తనపై మతోన్మాద శక్తులు సాగిస్తున్న భయానక నీచ బెదిరింపులను బహిర్గతం చేస్తూ సామాజిక మాధ్యమాలలో ప్రసారం చేసిన పోస్టింగులను రెండు రోజులుగా చూస్తున్నాం. అవి చదివిన వారెవరైనా రాబోయే ప్రమాదాన్ని శంకించాల్సి ఉంది. మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలలో డాక్టర్ నరేంద్ర దభోల్కర్, గోవింద పన్సారే, ప్రొఫెసర్ కల్బుర్గి, జర్నలిస్టు గౌరీ లంకేశుల ప్రాణాలను మతోన్మాద శక్తులు బలికొన్న తీరు మనందరి దృష్టిలో ఉంది.
"ఏ దేశ యువతకైనా మత విద్వేషాలు అత్యంత ప్రమాదకరం అని నేను చెప్తున్నందుకు నన్ను ద్వేషిస్తున్నారు, బూతులు తిడుతున్నారు..నా ఫోటోలు మార్ఫింగ్ చేస్తున్నారు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు." అని తులసి చoదు స్వయంగా చెప్పుకున్నారు.
"ఒక్క రాష్ట్రంలో అయినా మతం పేరు చెప్పకుండా ఎందుకు గెలవలేకపోతున్నారు?" అని ప్రశ్నిస్తున్నందుకు ఆమెను బండబూతులతో బెదిరిస్తున్నారు.
"ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం కంటే ఏ దేశానికయినా అత్యంత ప్రమాదకరమైన విషయం మరొకటి ఉండదు," అoటూ ఆమె మతసామరస్యాన్ని బోధించినందుకు సభ్య సమాజం ఉచ్చరించడానికి సిగ్గుపడే విధంగా మాట్లాడుతున్నారు. ఉద్దేశ్యపూరితంగా సొంత పేర్లు చెప్పుకోకుండా, ఫేక్ అకౌంట్స్ నుంచి ఘోరమైన కామెంట్స్ చేస్తున్నారని, ఇన్ బాక్స్ మెసేజస్ వస్తున్నాయని తులసి చందు లోకానికి వెల్లడించారు.
నిజానికి తులసి చందు మెయిన్ స్ట్రీమ్ మీడియా మౌనం వహిస్తున్న అనేక వాస్తవాలను తెగించి సమాజం ముందుకు తెస్తున్నారు. తెలంగాణలో ఇథనాల్ ఫ్యాక్టరీ కలిగిస్తున్న నష్టాలపై ఆందోళన చేస్తున్న ప్రజల ఆవేదనలను ప్రపంచానికి వినిపించడం అందులో వొకటి. ఈ విధమైన వార్తలతో ఆధిపత్యశక్తులకు కంటగింపుగా మారడంతో పాటు అంతర్జాల కిరాయి పోకిరీ గ్యాంగుల బెదిరింపులతో తులసి చందు ఘోరమైన అవమానాలకు గురవుతున్నారు.
మతవిద్వేషాలను రెచ్చగొట్టే విధంగా హైటెక్ సిబ్బందితో ఆర్ఎస్ఎస్ నెలకొల్పిన అబద్ధాల ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేసే భయంకరమైన అచారిత్రకాలను, అడ్డగోలు ప్రచారాలను, ఊరు పేరు లేని కిరాయి వ్యక్తులతో అన్ని భాషలలో వ్యాప్తిచేస్తున్నారు. సామాజిక మాధ్యమాల నిండా ఈ అబద్ధాలను చదవక తప్పని దుర్మార్గ కాలంలో మనం జీవిస్తున్నాం. దేశంలో ఈ గోబెల్స్ అబద్ధాల ప్రభావానికి ఎక్కువగానే యువత లోనవుతున్న పరిస్థితి నేడు ఉంది. ఈ భయంకర సాంస్కృతిక కాలుష్యాన్ని వ్యాప్తి చేసే మతోన్మాదుల దుష్ప్రచారాలను ప్రశ్నించినా, ఖండించినా, నిరూపించినా ఏదో వొక రూపంలో బెదిరిస్తున్నారు.
తులసి చందు గురవుతున్న విధంగా, సంస్కారవంతులు ఉచ్చరించలేని బండబూతుల ట్రోలింగ్ ను అనేకమంది మహిళా ఉద్యమ కార్యకర్తలు గతంలో తీవ్రంగా ఎదుర్కొన్నారు.
జర్నలిస్టు తులసి చందు ఇప్పుడు అలాంటి దాడులను ఎదుర్కొనే సంస్కారహీన పరిస్థితులు మన ముందుకు వచ్చాయి. మనo ఉద్యమ స్థాయిలో ఈ విద్వేష పూరిత దాడులను, ఆలోచనలను మొగ్గలోనే తుంచి వేయలేకపోతే భవిష్యత్తులో తెలుగు జాతి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. అభ్యుదయవాదులు, ప్రజాస్వామిక వాదులు తులసి చందు గారికి అండగా నిలిచి మతతత్వ శక్తుల చర్యలకు వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడి సంఘిభావం తెలుపుదాం !!
నేటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దాని వెనకనున్న ఆర్థిక రాజకీయ శక్తులు దేశ సంపదలను అడ్డగోలుగా కైంకర్యం చేసే పనిలో ఉన్నాయి! అందుకే అబద్దాల వాగ్దానాలతో పరమ నిరంకుశ విధానాలతో దేశభక్తి, జాతీయత చాటున పరిపాలన సాగిస్తున్నారు!! గుప్పెడు మంది చేతుల్లో గుత్తాధిపత్యం నెరపటానికి ఉన్మాదమే మతంగా వ్యాప్తి చేస్తునారు. దేశ ప్రజల నడుమ మతం పేరుతోనూ, అనేక ఇతర రూపాలతోనూ విద్వేషాలను, అనైక్యతను ప్రచారం చేస్తున్నారు. తమ నిత్య జీవిత సమస్యల నుండి ప్రజలను పక్కదారి పట్టించే విధానాలను అనుసరిస్తున్నారు. ఇలాంటి పరిపాలనను ప్రశ్నించే, విమర్శించే, వ్యతిరేకించే శక్తులను భయభ్రాంతులను చేయడానికి దాడులకు, బెదిరింపులకు, విద్వేష రాజకీయాలకు పాల్పడుతున్నారు.
మతోన్మాద శక్తుల ఫాసిస్టు తరహా ధోరణులను, పోకడలను వ్యతిరేకిస్తూనే తులసి చందు పై జరుగుతున్న ట్రోలింగ్ను మేమందరము ఖండిస్తున్నాం! తులసి చoదుకు మా నైతిక మద్దతును అందిస్తున్నాం!!
బెదిరింపులతో ఎంతోకాలం రాజకీయాలు సాగించలేరని తెలియజేస్తున్నాం!
ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రత్యేకించి తెలంగాణ, తులసి చందుపై జరుగుతున్న ట్రోలింగ్ ప్రమాదాన్ని సువోమోటో కేసుగా పరిగణించి , మహిళా రక్షణ చట్టాలను అమలు చేసి నేరస్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాము.
ఇట్లు
కొత్తపల్లి రవిబాబు,
జస్టిస్ చంద్రకుమార్,
జస్టిస్ కె.జి.శంకర్,
కె.రామచంద్రమూర్తి,
కె. శ్రీనివాస్,
తమ్మారెడ్డి భరద్వాజ,
బి. విజయ భారతి,
నిఖిలేశ్వర్,
కృష్ణాబాయి,
k. శివారెడ్డి,
శీలా సుభద్రాదేవి,
నందిని సిధారెడ్డి,
జైధీర్ తిరుమలరావు,
భూపాల్,
ప్రొఫెసర్ డి. నర్సింహారెడ్డి,
దివికుమార్,
అరసవిల్లి కృష్ణ,
ఎ. కే. ప్రభాకర్,
కె వి కూర్మనాథ్,
ఖాదర్ మొహియుద్దీన్,
ఎన్ వేణుగోపాల్, వీక్షణం,
డా.నళిని,
ఎస్. కాత్యాయని,
దేవి,
కల్లూరి భాస్కరం,
ప్రొఫెసర్ రామచంద్రయ్య,
ప్రొఫెసర్. తోట జ్యోతిరాణి,
సూర్యసాగర్,
కాత్యాయని విద్మహే,
బైస దేవదాసు, నేటి నిజం,
తోలేటి జగన్మోహన్ రావు,
చంద్రశేఖర్ HRF,
యం. లక్ష్మి, స్త్రీ విముక్తి సంఘటన,
కె.శోభాదేవి,
పెనుగొండ లక్ష్మీనారాయణ, అరసం,
రివేరా, విరసం,
బి. అరుణ (జనసాహితి),
సత్యాజీ, సాహితీ స్రవంతి,
ఎన్. అంజయ్య, సామాజిక శాస్త్రాల వేదిక,
డాక్టర్ జతీన్ కుమార్,
మహెజబీన్ ,
డాక్టర్ విజయ, స్త్రీ విముక్తి సంఘటన,
తరిమెల అమర నాధ్ రెడ్డి,
శివలక్ష్మి,
ఏకే బాలాజీ, కలకత్తా,
వఝుల శివకుమార్,
తాడి ప్రకాష్,
డా.భట్టు లక్ష్మీనారాయణ,
తమ్మినేని అక్కిరాజు,
కార్టూనిస్ట్ శంకర్,
ఆర్టిస్ట్ అన్వర్,
కార్టూనిస్ట్ నర్సింహ,
జుగాష్ విలీ,
వెనిగళ్ల వెంకటరత్నం,
నాళేశ్వరం శంకరం,
విజయ భండారు ,
జనజ్వాల, వనపర్తి,
ఎన్. సైదారావు, అడ్వకేట్,
సింగంపల్లి అశోక్ కుమార్,
శ్రీశ్రీ సాహిత్య నిధి,
పి ఎస్ నాగరాజు, ప్రజాసాహితి,
పరుచూరి అజయ్ కుమార్, అరసం,
K.S.C. బోస్, సంగమం, విజయవాడ
రాఘవరెడ్డి, భిన్నస్వరాలు, తెనాలి
నార్నె వెంకట సుబ్బయ్య, హేతువాద సంఘం, ఒంగోలు,
ఈతకోట సుబ్బారావు, విశాలాక్షి, నెల్లూరు,
వి.హనుమంతరావు - ఓపిడిఆర్ ప్రధాన కార్యదర్శి

