ద్రౌపదీ!ఆయుధం అందుకో శ్రీకృష్ణుడు ఇక రాడు..!

0
ద్రౌపదీ! ఆయుధం అందుకో
శ్రీకృష్ణుడు ఇక రాడు..
గోరింటాకు చేతులతో కత్తి పట్టుకో
నీ చీరను నువ్వే కాపాడుకో
శకుని జూదమాడుకుంటున్నాడు
మెదళ్లన్నీ అమ్ముడైపోతాయి
ద్రౌపదీ! ఆయుధం అందుకో
శ్రీకృష్ణుడు ఇక రాడు..”
ఇంకా ఎంతకాలమని
వేచి చూస్తావ్!
అమ్ముడైపోయిన మీడియాను
ఏమని రక్షణ అడుగుతావ్!
దుశ్శాసన సభలో సిగ్గులేని
వారంతా నీ మానాన్ని
ఏం కాపాడుతారు?
ద్రౌపదీ! ఆయుధం అందుకో
శ్రీకృష్ణుడు ఇక రాడు..
నిన్నటి వరకు రాజు
గుడ్డివాడు మాత్రమే..
ఇప్పుడు చెవిటి, మూగ కూడా..
ప్రజల నోళ్లకు కుట్లు వేశారు
చెవులకు కట్లు కట్టారు
ఈ కన్నీళ్లు నీవేనని నువ్వే చెప్పుకో
ఎవరికి ఏం చెప్పగలం?
ద్రౌపదీ! ఆయుధం అందుకో
శ్రీకృష్ణుడు ఇక రాడు..
(భారతీయ రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్‌కు వ్యతిరేకంగా కొన్నాళ్లుగా ఉద్యమిస్తున్న రెజ్లర్ వినేశ్ ఫోగట్ తాజాగా ఓ కవితను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. హిందీ కవి పుష్యమిత్ర ఉపాధ్యాయ్ రాసిన ఆ కవితను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.ఇదీ ఆ కవిత!)

Post a Comment

0Comments
Post a Comment (0)