రిపోర్టర్: వినేష్ జీ! మీరు అథ్లెట్ కదా..ఒక అథ్లెట్ కి ట్రైనింగ్ అన్నిటి కంటే ముఖ్యమైంది. దానికి ఒక కఠినమైన షెడ్యూల్ ఉంటుంది. మీరే కాకుండా ఇక్కడ ఇంకా చాలా మంది అథ్లెట్లు ఉన్నారు. స్పోర్ట్స్ మీకు ఎంతో ఖ్యాతిని ఇచ్చాయి. అలాంటిది మీ ఆటే చెడిపోతే.... మీరు మీ భవిష్యత్ కెరీర్లో ఏమి చేస్తారు?
వినేష్ ఫోగట్: ఒక వేళ నా ఆట చెడిపోవడం ద్వారా లక్షల మంది అమ్మాయిల ఆట బాగుపడుతుందంటే, నేను ఎంతో గర్వంగా నా ఆటను చెడగొట్టుకోవటానికి సిద్ధంగా ఉన్నాను.
