అబద్ధం! నిజం!!
~~
దేవుడు అబద్ధం - పూజారి నిజం
పూజలు అబద్ధం - గుళ్ళు,హుండీలు నిజం
న్యాయం అబద్ధం - లాయర్ ఫీజు నిజం
న్యాయస్థానం అబద్దం - కటకటాలు నిజం
ప్రజాస్వామ్యం అబద్ధం - చట్టసభలు నిజం
నీతులు అబద్ధం - లాభనష్టాలు నిజం
సత్య హరిశ్చంద్రుడు అబద్ధం - ఇచ్చోటనే..పద్యం నిజం
ఆత్మ అబద్ధం - శరీరం నిజం
అంతరాత్మ అబద్ధం - ఆత్మవంచన నిజం
-కె.ఎన్.వై.పతంజలి
(గెలుపు సరే..బతకడం ఎలా? అనే పుస్తకం నుండి)

