★ మోడీ ప్రకటించిన ‘అమృత్ మహోత్సవ్' సందర్భంగా, కేవలం జాతీయ జెండాలు ఎగురవేయడం కాదు-ఆ జెండా వెనుక సాగిన మహత్తర స్వాతంత్య్ర పోరాట చరిత్రను ఈ తరంవారు తెలుసుకోవాలన్న ఆశయంతో పిడిఎస్ఓ-ఎన్.వై.ఎస్ సంయుక్తంగా ఈ విలువైన పుస్తకాన్ని ప్రచురించారు.
★ ఇందులో 1857 తిరుగుబాటుపై, రైతులు,గిరిజనులు, కార్మికులు, మహిళలు, విద్యార్థులపై రాసిన వ్యాసాలు ఆయా రంగాలలో జరిగిన ఉద్యమాలను వివరిస్తున్నాయి. ఈనాటి సైబర్ తరం వారు... వారి పూర్వీకులు వలస పాలనకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమాలు, ఆందోళనలు, పోరాట త్యాగాలు తెలుసుకోవడం ద్వారా వారి సామాజిక బాధ్యతను కొంతైనా గుర్తిస్తారు. బూతుల భాష మాత్రమే తెలిసిన ఈనాటి రాజకీయ నాయకులకూ, ఎన్నో త్యాగాలు చేసి, ఎన్నో కష్టాలు అనుభవించి దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన ఆనాటి వీరులను ఈ పుస్తకం చదవడం ద్వారా గుర్తించి ఎటువంటి పోరాటాలు చేయాలో తెలుసుకుంటారు.
★ అన్ని రంగాల ప్రజల జీవితాలను ఛిన్నాభిన్నం చేసే సామ్రాజ్యవాద, కార్పోరేట్ల అనుకూల పాలక విధానాలనూ, మతం పేరుతో ప్రజలలో చిచ్చుపెడుతున్న పాలకుల ప్రయత్నాలను బట్టబయలు చేస్తూ కరపత్రాలు, లఘు పుస్తకాలు విరివిగా ప్రచురించి ప్రచారం చేయాల్సిన అవుసరం నేడు వుంది. వీటిని హైస్కూళ్ళకు, కళాశాలలకు తీసుకువెళ్ళి వాస్తవాలను యువతరానికి తెలియచేసే బాధ్యత యువజన సంఘాలూ, విద్యార్థిసంఘాలూ స్వీకరించాలి. పాలకవర్గాలకు సంబంధించిన సంస్థలు సోషల్ మీడియా ద్వారా చేస్తున్న దుష్ప్రచారాన్ని సోషల్ మీడియా ద్వారానే త్రిప్పికొట్టాల్సిన అవసరం కనపడుతోంది.

