ప్రజల అజ్ఞానం వల్లనే ప్రభుత్వం శక్తివంతమవుతోంది. ప్రభుత్వానికి (రాజ్యానికి) ఈ విషయం తెలుసు. అందువల్లనే నిజమైన జ్ఞానాన్ని ప్రసరింపచేయటాన్ని ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. జ్ఞాన ప్రచారం అనే మిషతో ప్రభుత్వం అజ్ఞానాన్ని ప్రచారం చేస్తుంది. విద్యాలయాలు, ఉన్నత విద్యాలయాలు, అకాడమీలు, రకరకాల సంస్థలు ప్రభుత్వ నియంత్రణలో ఉంటూ ఉత్తుత్తి జ్ఞానాన్ని ప్రచారం చేస్తాయి. విద్య పరిపూర్ణమైనది, సత్యమైనది అయినపుడే అది మంచి విద్య అవుతుంది. అటువంటి విద్య కోసం నిస్వార్థమైన త్యాగాలతో కూడిన ప్రయత్నాలు నిరంతరం జరగాలి
౼ లియో టాల్ స్టాయ్

